పరీక్షలు లేకుండానే డిగ్రీ విద్యార్థులు పాస్ ?

తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే పరీక్షల విషయంలో విద్యార్థులను పాస్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు డిగ్రీ విద్యార్థుల పై దృష్టి పెట్టింది.

ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వాలి అని నిశ్చయించింది. యూజీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది. వర్సిటీ తీసకున్న ఈ నిర్ణయంతో ఉన్నత చదువులకు వెళ్లే వారికి లేదా ఉన్నత ఉద్యోగాలకు వెళ్లే వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

మొత్తం మార్కుల్లో 50 శాతానికి గత సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా సగటు తీశారు. మిగతా 50 శాతానికి ఇంటర్నల్‌ పరీక్షలు, అప్పటికే కేటాయించిన మార్కుల సగటు తీసి గ్రేడ్లు కేటాయించారు. దీంతో గత సెమిస్టర్లు, ఇంటర్నల్స్‌లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి మంచి గ్రేడ్లు దక్కనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.