100 కోట్ల షేర్ సాధించిన తెలుగు సినిమాలు ఇవే..!

ఒక్కప్పుడు తెలుగు సినిమా రేంజ్.. గట్టిగా అంటే 45కోట్ల వరకూ మాత్రమే ఉండేది. ‘పోకిరి’ చిత్రం సాధించిన ఘనత అది. అయితే దానిని రాజమౌళి ‘మగధీర’ తో 75 కోట్ల షేర్ వరకూ పెంచాడు. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రం 78కోట్ల  వరకూ కలెక్ట్ చేసింది. అయితే 100 కోట్ల షేర్ సాధించిన సినిమాలు ‘బాహుబలి’ తోనే మొదలైంది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ లిస్ట్ లో చేరారు. అయితే ఈ లిస్ట్ లో ఎక్కువగా ప్రభాస్,చిరు, మహేష్ లు ఉండడం విశేషం. ఇక 100 కోట్లు షేర్ ను మించి సాధించిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి. 

 
1)బాహుబలి2 : రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 855 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
2) బాహుబలి ది బిగినింగ్ : బాహుబలి మొదటి పార్ట్ గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 311 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
3) సాహో : బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 213 కోట్ల షేర్ ను రాబట్టింది.
 
4) అల వైకుంఠపురములో : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 162 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
5) సైరా నరసింహా రెడ్డి : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
6) సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 142 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
7) రంగస్థలం : రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
8) మహర్షి : మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
9)భరత్ అనే నేను : మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  102 కోట్ల షేర్ ను రాబట్టింది. 
 
10) ఖైదీ నంబర్ 150 : మెగాస్టార్ చిరంజీవి – వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 101 కోట్ల షేర్ ను రాబట్టింది.   
 

Leave a Reply

Your email address will not be published.