ఒక్క ఎపిసోడ్ కోసం తమన్నా ఎంత తీసుకుంటుంది ?

ఇప్పుడు భవిష్యత్తు మొత్తం OTT ప్లాట్ఫారం ఏ. అటు సినిమా నుంచి వెబ్ సిరీస్ వరకు..షో నుంచి ఇంటర్వ్యూ వరకు అన్ని OTT ప్లాట్ఫారం కె రాబోతున్నాయి అని అందరికి తెల్సిందే.

ఇలాంటి తరుణంలో అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ప్లేట్ఫ్రొమ్ లో స్టార్స్ తో ఒక టాక్ షో రాబోతుంది. దీని కోసం తమన్నా ని యాంకర్ గా ఫిక్స్ చేసారు. మొదటి షోకి తమన్నా ఇద్దరి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేయబోతోందన్నమాట. గతంలో తమన్నా వీరిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. బన్నీతో బద్రీనాథ్, రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన తమన్నాకు వారితో మంచి స్నేహం ఉంది.

పైగా బన్నీ, రామ్ చరణ్ తో ఒకేసారి ఇంటర్వ్యూ అంటే అంచనాల డోస్ కూడా హై రేంజ్ కో ఉంటుంది. డ్యాన్స్ నటనతో ఇద్దరి హీరోలకు పోటీని ఇచ్చిన తమన్నా ఇప్పుడు టాక్ షోతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.