పుష్ప ని అడ్డుకునే విలన్ గా రోజా

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో రోజా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లేడీ విలన్‌గా రోజా కనిపించనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది

దీనికి సంబంధించి ఇప్పటికే రోజాను సంప్రదించడం, పాత్ర నచ్చి సినిమాలో నటించేందుకు రోజా ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ మధ్యన బోయపాటి, బాలయ్య సినిమాలో రోజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా.. దర్శకుడు వాటిని ఖండించారు.

అయితే అసలు ఈ సినిమాలో రోజాను తీసుకోవాలనే ఆలోచన సుకుమార్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై కూడా టాలీవుడ్‌లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.