మహేష్ కు గిఫ్ట్ ఇచ్చిన రష్మిక

సరిలేరు నీకెవరు లో సూపర్ స్టార్ మహేష్ తో జోడిగా నటించిన రష్మిక, మహేష్ కుటుంబానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. సరిలేరు లాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ లో పార్ట్ అయిన రష్మిక మహేష్ మీద అభిమానంతో ఇచ్చిన సుర్ప్రిసె అటు మహేష్ కె కాకుండా తన కుటుంబానికి కూడా బాగా నచ్చింది.

ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అనే కదా ? ప్రస్తుతం కూర్గ్ లో ఉన్న రష్మిక, అవకాడో ఫ్రూట్స్‌తో పాటు…ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. రష్మిక గిఫ్ట్ పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో… నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.