వర్మ క్లైమాక్స్ కలెక్షన్లు దద్దరిలిపోతున్నాయి..!

ఒక పోర్న్ స్టార్ తో సినిమా తీయడమే కాకుండా దాని దాని డిజిటల్ ప్లేట్ ఫారం లో రిలీజ్ చేసి 100 కి ఒకసారి చూడచ్చు అని చెప్తే అసలు ఎవరు చూస్తారు అనుకున్న వారు అందరికి సమాధానం ఇచ్చేసాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

క్లైమాక్స్ సినిమా కలెక్షన్ లు దానికి నిదర్శనం. శనివారం ఓటీటీలో రిలీజ్ చేసిన క్లైమాక్స్ చిత్రానికి రూ.100 టికెట్ ధరను నిర్ణయించారు. జీఎస్టీ ఇతర చార్జీలతోపాటు మొత్త కలిపి సుమారు రూ130 వరకు ధరగా నిర్ణయించారు. ఈ సినిమాకు తొలి 12 గంటల్లో 1,68,596 మంది చూశారు.

అయితే క్లైమాక్స్ సినిమా రిలీజ్‌కు ముందు వర్మ తన మూవీకి ఓపెనింగ్ డే రోజున రూ.50 లక్షలు వస్తాయని అంచనా వేశారు. కానీ 12 గంట్లలోనే 1.68 లక్షల మంది చూడటంతో అంతకంటే భారీగా వసూళ్లు నమోదయ్యాయి. తొలి 12 గంటల్లోనే రూ.1.6 కోట్లు వసూలు చేయడం విశేషంగా భావించాల్సిందే. ఇలాంటి కలెక్షన్లు సినిమా నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.