రాహుల్…పునర్ణవి రీలేషన్ మధ్య సీక్రెట్ బయట పెట్టిన రోహిణీ!

బిగ్ బాస్ సీజన్-3 బ్రహ్మాండంగా సాగుతుంది..రోజురోజుకీ ఈ షోకి రేటింగ్ భారీగా పెరుగుతూ పోతున్న క్రమంలో ఈ షోలో ఒక్కో వారం ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు…కట్ చేస్తే గత వారం కొన్ని ఊహించని పరిణామాల మధ్య అనూహ్యంగా రోహిణీ ఎలిమినేట్ కావడం తెలిసిందే.

అయితే ఇదిలా ఉంటే…కాంట్రొవర్సీ మ్యాటర్ ఎక్కడుంటుందా అని..ప్రతీ చోటా పడిగాపులు కాసే కొన్ని న్యూస్ ఛానెల్స్…బిగ్ బాస్ నుంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం పాపం…వెంటనే వాళ్ళను వాళ్ల న్యూస్ ఛానెల్ స్టూడియోస్ కి పట్టుకెళ్లి…సవా లక్ష ప్రశ్నలతో ఇంటర్‌వ్యూ చేసి..ఏదో ఒక కాంట్రొవర్సీతో సేల్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు…

ఇక అదే క్రమంలో ఇప్పటివరకూ వరుసగా..ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను ఇంటర్‌వ్యూ చేసిన ఓ ఛానెల్…రోహిణీని కూడా ఇంటర్‌వ్యూ కి పిలిచి అసలు రాహుల్…పునర్ణవి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కట్ చేసి ఒక్కసారి షోలోకి వెళితే..

బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి రాహుల్ కు తినిపించటం, రాహుల్ పునర్నవితో డేటింగ్ గురించి మాట్లాడటం వలన రాహుల్, పునర్నవి మధ్య ఏదో ఉందని వార్తలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..ఇక అదే క్రమంలో బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత తమన్నా సింహాద్రి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య ఏదో ఉందనేలా వ్యాఖ్యలు చెయ్యడంతో అందరూ అదే నిజం అనుకుంటున్న సమయంలో..

రోహిణీ మాట్లాడుతూ….రాహుల్, పునర్నవి కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వారిద్దరి మధ్య ఏమీ లేదని రోహిణి క్లారిటీ ఇచ్చింది..!రాహుల్ కావాలనే పునర్నవిని ఆట పట్టిస్తాడని అంతకు మించి వారిద్దరి మధ్య ఏమీ లేదని రోహిణి స్పష్టం చేసింది.

మొత్తంగా అదన్న మాట అసలు మ్యాటర్.

Leave a Reply

Your email address will not be published.