వర్మ గురుంచి ఎవరికీ తెలియని నిజాలు చెప్పిన పూనమ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పెంట ఎక్కడ ఉంటె అక్కడ ఉంటున్నారు , లాక్ డౌన్ లో అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటె ఈయన మాత్రం అటు డిజిటల్ ప్లేట్ ఫ్రొం లో సినిమాలు రిలీజ్ చేస్తూ బిజీ గా ఉండడమే కాకుండా కుదిరినప్పుడు కాంట్రేవేర్సీలు చేస్తున్నాడు.

నిన్న ఆదివారం నేను పవన్ కళ్యాణ్ పై ఒక సినిమా తీస్తున్నాను అని చేపి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు వర్మ. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై పూనమ్ కౌర్ స్పందిస్తూ ‘‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’’ అని పూనమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published.