‘నాంది’ లో అలా నటించడానికి కారణం అదే

అల్లరి నరేష్ చాల రోజుల తరువాత ఒక హిట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నాంది సినిమా టీజర్ చుసిన ఎవరు అయినా ఇదే మాట చెప్తారు.

‘నాంది’ సినిమా గురించి తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నాంది’ కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందని, అందుకే నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు నరేష్. ఏ పాపం తెలియని ఒక అమాయకుడు ఓ కేసులో అరెస్టయి జైలుకు వెళ్తే, ఆ తరవాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనే కథతో ఈ సినిమాను ఉంటుందని నరేష్ చెప్పారు. తనతో పాటు సినిమాలో నటించిన ఏ ఒక్కరూ మేకప్ వేసుకోలేదని స్పష్టం చేశారు.

అయితే, ‘నాంది’ ప్రయోగాత్మక చిత్రం కాదని అన్నారుWi. ఇంత వరకు తానెప్పుడూ చేయని జోనర్ అని చెప్పారు. ప్రయోగం అంటే ‘లడ్డు బాబు’ అని, ఆ సినిమాలో తన మొహాన్ని దాచుకుని కొత్త మొహంతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని వివరించారు.

కాగా, ‘నాంది’ షూటింగ్ చివరి దశకు చేరుకుందని నరేష్ వెల్లడించారు. ఇంకా పదిహేను రోజుల చిత్రీకరణ ఉందని అన్నారు. అయితే, ఈ షూటింగ్ జనసందోహంతో చేయాలన్నారు. కాబట్టి, ఆ సన్నివేశాలను ప్రభుత్వ నిబంధనలతో ఇప్పుడు తీయలేమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.