ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్..!!

ఏపీ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఒక దశలో తగ్గాయి అనుకున్న కేసులు తిరిగి పుంజుకుంటున్నాయి. దీనికి తోడు లాక్ డౌన్ తీసేయడంతో జనాలు అందరూ రోడ్ మీద తిరగడం, అటు బోర్డర్లు కూడా తెరవడం తో కొత్త కేసులు వస్తున్నాయి.

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 465 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8వేల దిశగా పరుగులు తీస్తున్నాయి.. అంతేకాదు రెడ్, కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరిగింది. ఇలా ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అవసరమైన చోట్ల కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో కూడాకేసుల సంఖ్య పెరగడంతో.. వైరస్‌ వ్యాప్తి వల్ల ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు.

కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో దాదాపు లాక్‌డౌన్ నిబంధనలే ఉన్నాయి. కేవంల ఉదయం మూడు గంటల పాటే జనాలకు రోడ్లపైకి అనుమతి. హోటల్స్‌కు ఉదయం ఏడు నుంచి సాయంత్రం 7 వరకు కేవలం టేక్ ఏ వేకు అనుమతి. ఇక జ్యువెలరీ, క్లాత్, షాపింగ్ మాల్స్ వంటికి కూడా మూతపడనున్నాయి. ఇద్దరు కంటే ఎక్కువమంది రోడ్లపై ఉండకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవు.

Leave a Reply

Your email address will not be published.