సాక్షి లోకి బిత్తిరి సత్తి ఎంట్రీ

బిత్తిరి సత్తి..తీన్మార్ వార్తలతో అటు రెండు తెలుగు రాష్ట్రలో ఒక సంచలనం అయ్యాడు. తన బాషా వేషం తో అందరిని అలరించాడు. ఇక v6 నుంచి తప్పుకొని టీవీ9 లో అడుగు పెట్టిన సత్తి కొన్ని రోజులోనే బయటకి వచేసాడు.

అయితే టీవీ9 వదిలిన తరువాత అసలు ఎక్కడ పని చేస్తాడో అని వేచి చుసిన అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ రోజే (జులై 10) సాక్షితో అతని అనుబంధం మొదలైంది. ఆ ఛానెల్ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి బిత్తిరి సత్తి ఎంట్రీని స్వాగతించారు తోటి ఉద్యోగులు. ఇకపై ఆయన సందడి సాక్షి టీవీ తెరపై కనిపించనుంది

మొదట వీ6 ఛానెల్‌లో తీన్మార్ బులిటెన్‌తో వార్తలు చెప్పడంలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు బిత్తిరి సత్తి. దీంతో ఈ వార్తల తరహాలో టీవీ 5లో మాస్ మల్లన్న, హెచ్‌ఎం టీవీలో జోర్దార్ వార్తలు, టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్, టీ న్యూస్‌లో ధూంధాం ముచ్చట్లు ఇలా ప్రతి ఛానల్‌లోనూ ఒక్కో బులిటెన్ రన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.

దీంతో ఈ ట్రెండ్ క్యాచ్ చేసుకోవాలని ఆలోచన చేసిన సాక్షి యాజమాన్యం బిత్తిరి సత్తికి స్వాగతం పలికింది. అయితే లాక్‌డౌన్ కారణంగా గతంలో టీవీ9 వారు అందజేసిన ప్యాకేజీ మొత్తానికే సాక్షికి సత్తి ఓకే చెప్పాడని టాక్. ఏదిఏమైనా ఈ బిత్తిరోడిని సాక్షి ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి మరి!.

Leave a Reply

Your email address will not be published.