మహేష్ తో నేను సినిమా చేయట్లేదు

మహేష్ సర్కారు వారి పాట సినిమా కోసం ఒక ముఖ్యమైన పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నారు అంటూ వచ్చిన వార్తల పై స్పందించారు రేణు దేశాయ్.

అసలు సినిమాలకు దూరంగా ఉన్న రేణు సడన్ గా సినిమాలోకి అడుగు పెడ్తున్నారు అని వార్త చాల మందిలో ఒక ఆసక్తిని రేపింది. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి.. గత రెండు మూడు రోజులుగా తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని తెలిపింది. కాగా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి రియల్లీ హ్యాట్సాఫ్ అంటూ తనదైన స్టైల్‌లో స్పందించింది రేణు దేశాయ్. మహేశ్ బాబు సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది.

గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వస్తే.. హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం కారణంగానే ఇలాంటి రూమర్స్ పుట్టించారని రేణు తెలిపింది. అదేవిధంగా అకీరా సినీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడిన ఆమె.. అతను ఏ వృత్తిని ఎంచుకున్నా ఓ తల్లిగా ప్రోత్సహిస్తానని చెప్పింది. సినీ రంగం లోకి రావడమనేది అతని ఇష్టమే అని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.