వర్మ – పవన్ కళ్యాణ్ బయో పిక్ లో హీరో ఇతనే

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అందరి జీవితాల్లో మంట పెట్టె పనిలో ఉన్నాడు. లాక్ డౌన్ లో అసలు కాలిగా ఉండకూండా ఇప్పటికే వారానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్న వర్మ మరో సారి ఒక అప్డేట్ తో వార్తల్లోకి ఎక్కాడు.

ఏకంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తునట్టు ప్రకటించాడు. ‘‘ బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు.

అనంతరం ‘పవర్‌ స్టార్‌’లో పవన్‌ కల్యాణ్‌ పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ నా కొత్త సినిమా ‘పవర్‌ స్టార్‌’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కానీ, యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కానీ, ఉద్ధేశ్యపూర్వకం’’ అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.