రానా సినిమా పై పోలీస్ కేసు?

రానా సమర్పణలో వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం జూన్ 25న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమలో పడేసే యువకుడి కథ ఇది. ట్రైలర్ తోనే ఈ సినిమా పై క్రేజ్ పెరిగింది. సిద్ధూ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడ‌క్ష‌న్స్’ సంస్థ నిర్మించడం విశేషం.రవికాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. 
 
ఇదిలా ఉండగా ఈ చిత్రం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ రాకేష్ అనే వ్య‌క్తి.. సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ.చిత్రంలో ప్రధాన నటులకి హిందూ దేవతల పేర్లను పెట్టినందుకు అతను ఇష్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీం ఇబ్బందుల్లో చిక్కుకుంది. పూర్తి శృంగార‌భ‌రిత చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్ధు ముగ్గురు హీరోయిన్‌ల‌తో ప్రేమాయ‌ణం సాగిస్తుంటాడు. ‘శృంగార ఇతివృత్తంలో ఇతర మతాల దేవతలను కించపరుస్తూ ఆ పాత్రల్ని.. లేదా ఆ పేర్లతో పాత్రలను చూపించే ధైర్యం చేస్తారా? మతపరమైన నేపథ్యం ఎంచుకోవడం వెనక ఉద్ధేశపూర్వకమైన బలవంతం ఏదో ఉంది’ అంటూ అతను కంప్లైంట్ లో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published.