త్వరలోనే ఎన్టీఆర్ తో…పక్కా అని కన్ఫర్మ్ చేసిన దర్శకుడు!

మన తెలుగు హీరోలు తమిళంలో తమ టాలెంట్ చూపించే దర్శకులకు సినిమా ఇవ్వడం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తుంది. అయితే తమిళం నుంచి తెలుగుకు వచ్చే సరికి సినిమాను డీల్ చెయ్యడంలో కాస్త తేడా చూపించాలి లేదంటే…చాలా తేడాలు వచ్చేస్తాయి.

అయితే అదిరింది సినిమా తమిళంలో సూపర్ హిట్ సినిమా కావడంతో అదే క్రమంలో ఆ సినిమా దర్శకుడు అట్లీకి మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ దర్శకుడితో సినిమా చెయ్యడానికి ఒకే చెప్పేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని మనం వార్తలు వింటూనే ఉన్నాం.

ఇక వాటిని నిజం చేస్తూ…విజయ్ “విజిల్” సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చిన దర్శకుడు అట్లీ…ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పాడు…

ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తో తన తొలి హిందీ సినిమా చేస్తున్నాను అని…దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసాడు..

అయితే అసలే ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నాడు…పైగా భవిష్యత్తు నాయకుడు అంటూ…ఏవేవో న్యూస్ హల్‌చల్ చేస్తున్న తరుణంలో ఎన్టీఆర్ కాస్త సోషియల్ టచ్ ఉన్న కధలను ఎన్నుకుంటూ సాగితే….అటు ఆయన కరియర్ కే కాకుండా..ఆయన్ని లీడర్ గా చూడాలి అనుకున్న వారి ఆశలు కూడా నిజం అయ్యే చాన్సస్ ఉంటాయి…చూద్దాం మరి ఏం జరగబోతుందో,

Leave a Reply

Your email address will not be published.