ఎన్టీఆర్ తో ఆ డైరెక్టర్ సినిమా లేనట్టేనా?

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్.. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై చినబాబు..  కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఇక ఈ చిత్రం కూడా పూర్తయ్యాక ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్  ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అనధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.ఇదే విషయాన్ని విజిల్ ప్రీ రిలీజ్ వేడుకలో అట్లీ కూడా చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ను ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించబోతుననట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఎన్టీఆర్ రెండు సినిమాలు ఫినిష్ చెయ్యాలి.. మరోపక్క అట్లీ .. బాలీవుడ్ బాద్ షా అయిన షారుఖ్ ఖాన్ తో కూడా ఓ సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాకే ఎన్టీఆర్- అట్లీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

Leave a Reply

Your email address will not be published.