పదో తరగతి పరీక్షలు పెడతారా లేదా ?

దాదాపు అన్ని రాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలు లేకుండా పాస్ అయ్యేలా చెర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. అయితే ఏపీ లో మాత్రం ఇప్పటి వరకు టెన్త్ పరీక్షల పై ఒక క్లారిటీ రాలేదు.

దీని పై ఈ రోజు సాయంత్రం లోపు ప్రకటన చేసే అవకాశం ఉంది, డ్యూల్ ప్రకారం యథాతధంగా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని.. దీనిపై సీఎం జగన్‌తోనూ చర్చించినట్లు ఆయన చెప్పారు. పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని.. సీబీఎస్ఈకి కేంద్రం కూడా గడువు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి.

ఏపీ జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని కొన్ని రోజుల క్రిత ఆయన స్పష్టం చేశారు. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్, జులై 11న సెకండ్‌ లాంగ్వేజ్, జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగుతాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.