దేవరకొండ అబ్బాయి రెండో సినిమా మొదలు

విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..ఇప్పుడు మరో సినిమా తో వస్తున్నాడు. తన మొదటి సినిమా దొరసాని అటు ప్రేక్షకులకి కానీ కమర్షియల్ గా కానీ హిట్ అవ్వలేదు.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోగా రెండో సినిమా సిద్ధమైంది. ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుంది.

నిర్మాత వెనిగ‌ళ్ల ఆనంద‌ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సినిమా తొలి కాపీ సిద్ధంగా ఉంది. క‌థ‌కు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీద్దామ‌నుకునే నిర్ణయంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. గుంటూరు జిల్లా కొల‌క‌లూరు ప్రాంతం, గుంటూరు సిటీ, ప‌రిసర‌ ప్రాంతాల్లో షూటింగు చేశాం. పాత్రల‌న్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేస‌వికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ, లాక్‌డౌన్ ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశాం. త్వర‌లోనే విడుద‌ల తేదీ వివ‌రాల‌ను వెల్లడిస్తాం’’ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.