ఆ రికార్డు కొట్టిన ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రికార్డు లు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఆలా వైకుంఠపురం ఆడియో తో ఎన్నో రకాల రికార్డు లు బ్రేక్ చేసిన బన్నీ ఇపుడు తాజాగా మరో రికార్డు కొట్టాడు.

‘సరైనోడు’ హిందీ అనువాద చిత్రం బుధవారం 300 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది. అంటే, ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్‌లో వీక్షించారు. కాగా, యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘సరైనోడు’ హిందీ వెర్షన్ నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి.

గతేడాది ఆగస్టులో ఈ సినిమా 200 మిలియన్ మార్కును అందుకోగా.. ఇంచుమించుగా ఏడాది కాలంలో మరో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.

Leave a Reply

Your email address will not be published.