అదిరిపోయిన నరేష్ నాంది టీజర్

అల్లరి నరేష్ హీరోగా ప్రస్తుతం కాస్త బ్యాడ్ ఫసె లో ఉన్నాడు. నరేష్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. అందుకే తన కామెడీ రూట్ మర్చి ఈసారి సీరియస్ సినిమా తీస్తున్నాడు.

తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయినా నాంది సినిమా టీజర్ ఏ దీనికి ఉదాహరణ. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆతృతను పెంచేశాయి. ఇక ఇందులో నరేష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆలోచింపజేయడమే గాక మూవీపై అంచనాలు పెంచేసింది.

”ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది” అంటూ తీవ్ర ఆవేదన చెందుతూ నరేష్ ఈ డైలాగ్ చెప్పారు. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.