తెలంగాణ లో 872 కేసులు..మరింత పెరిగే అవకాశం

రోజు రోజుకి తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయ్. ముందు కంటే టెస్టులు పెరగడంతో అటువై కరోనా కేసులు కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయి.

ఒక వేళా ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ లో రోజుకి 1000 కేసులు పై బడి రావచ్చు అని అంచనా. సోమవారం (జూన్ 22) ఒక్క రోజు రాష్ట్రంలో 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,674కు చేరింది.నిన్న ఒక్క రోజే ఏడుగురు మరణించడంతో మరణాల సంఖ్య 217కు చేరుకుంది. సోమవారం మొత్తం 3189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 12, మంచిర్యాలతో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డిలో 3, మెదక్ జిల్లాలో 3, జనగాంలో 2, కరీంనగర్‌లో 2, మహబూబాబాద్‌లో 2 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది.

Leave a Reply

Your email address will not be published.