శ్రీహరి వల్లే ‘ఆగడు’ ఫ్లాప్ అయ్యిందా.. ఎలా?

మహేష్ బాబుకి.. ‘ ‘పోకిరి’ సినిమా తరువాత హిట్టు లేదు.. ఇక మహేష్ పనైపోయినట్టే’ అని అంతా అనుకున్న తరుణంలో ‘దూకుడు’ సినిమా ఇచ్చి ప్లాప్స్ నుండీ గట్టెక్కించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఆ సినిమాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సెంటిమెంట్.. ఇలా అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయి. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ ను ఆదుకున్న సినిమాల్లో ‘దూకుడు’ కూడా ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అయితే ఆ తరువాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటే దాని పై ఎలాంటి అంచనాలు ఏర్పడతాయి. అలాగే ‘ఆగడు’ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ‘దూకుడు’ ‘గబ్బర్ సింగ్’ సినిమాలను మిక్స్ చేసి వడ్డించేసాడు శ్రీను వైట్ల అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం శ్రీహరిని అనుకున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు అన్నయ్య పాత్రలో అజయ్ కనిపించాడు. కానీ మొదట ఆ పాత్రకు శ్రీహరిని అనుకున్నారట. ఎన్నో ఎమోషనల్ సీన్స్ వీరి మధ్యలో ఉండేలా ప్లాన్ చేశారట. కానీ శ్రీహరి సడెన్ గా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం.. అలాగే ఈ చిత్రానికి రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడికి ‘పటాస్’ సినిమాలో అవకాశం వచ్చిన కారణంగా అతను వెళ్లిపోవడంతో.. చాలా వరకూ స్క్రిప్ట్ ను మార్చేసాడట వైట్ల. ఒకవేళ శ్రీహరి ఉండి.. అనిల్ కూడా సెకండ్ హాఫ్ బాగా డెవలప్ చేసి ఉంటే ‘ఆగడు’ కొంచెమైనా ఆడి ఉండేదేమో..!

Leave a Reply

Your email address will not be published.